»July 23rd 2023 Is The Final Match Between India A And Pakistan A Acc Mens Emerging Teams Asia Cup 2023
IndiAvsPakistan: నేడే ఇండియా, పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్
నేడు ఇండియా ఏ(India A) వర్సెస్ పాకిస్థాన్ ఏ(Pakistan A) ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు మొదలు కానుంది. సీనియర్ పురుషుల టీం ఆటగాళ్లు పాల్గొనే పోటీ కానప్పటికీ ఆ ఉత్సాహం మాత్రం అలాగే ఉంది. బ్లాక్‌బస్టర్ ఫైనల్ ఇరు జట్లు గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయి.
ఈరోజు ACC పురుషుల ఎమర్జింగ్ ఆసియా కప్ 2023(ACC Mens Emerging Teams Asia Cup 2023)లో భాగంగా టీమిండియా(India A), పాకిస్తాన్(Pakistan A) జట్ల మధ్య హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ని ఓడించిన తర్వాత, భారత్ A జట్టు ఇప్పుడు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ Aతో జులై 23, 2023 మధ్యాహ్నం రెండు గంటలకు తలపడనుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని ప్రతిష్టాత్మకమైన R. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. UAE, నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లపై గెలుపొందిన తర్వాత భారత్ A జట్టు టోర్నమెంట్లో అజేయంగా నిలిచింది. అయితే మొదటి మూడు గేమ్‌లు సునాయాసంగా గెలుపొందగా, బంగ్లాదేశ్ Aతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ మాత్రం ఉత్కంఠగా కొనసాగింది.
ఇండియా A vs పాకిస్తాన్ A ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఫ్యాన్ కోడ్ యాప్ లేదా వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దీంతోపాటు టెలివిజన్లలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఏపై విజయం సాధించాలని ఇండియా పట్టుదలతో ఉండగా..మరోవైపు పాకిస్తాన్ జట్టు సైతం విజయం సాధించాలని చూస్తోంది.