»Jana Sena 10th Formation Day Pawan Kalyan Says Will Form The Government In Future
Jana Sena 10th Formation Day: రోజుకు రూ.2 కోట్లు వస్తాయ్, చెప్పుతో కొడతానన్న పవన్ కళ్యాణ్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Chief Minister of Telangana K Chandrasekhar Rao) తనకు వెయ్యి కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బ గట్టిగా పడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena chief Pawan Kalyan) హెచ్చరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Chief Minister of Telangana K Chandrasekhar Rao) తనకు వెయ్యి కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బ గట్టిగా పడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena chief Pawan Kalyan) హెచ్చరించారు. మచిలీపట్నంలో పార్టీ పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా (Jana Sena 10th Formation Day) ఆయన మాట్లాడారు. కేసీఆర్ (KCR) నాకు వెయ్యి కోట్లు ఆఫర్ చేశారట.. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో వెతుక్కుంటున్నాను.. నేను మిమ్మల్ని డబ్బులు పెట్టి కొనగలనా.. సిద్ధంతంతో మాత్రమే మీకు దగ్గర అవుతాను.. గతంలోను ఇలాగే ప్యాకేజీ అంటే చెప్పు చూపించాను.. తెనాలికి చెందిన వెంకటేశ్వర రావు చేసిన చెప్పులను నేను వేసుకుంటాను.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పు దెబ్బ గట్టిగా పడుతుంది.. నేను డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదు.. అవసరమైతే ఇస్తాను అని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడారు.
నేను ఇప్పుడు ఓ సినిమాను (Tollywood) 22 రోజుల పాటు చేస్తున్నానని, దానికి రూ.45 కోట్లు తీసుకుంటున్నట్లు చెప్పారు. అంటే రోజుకు రూ.2 కోట్లు వస్తున్నాయని, అలాంటి తనకు డబ్బు ఆశ లేదన్నారు. ఒక్క కులం వాళ్లు ఆదరిస్తేనే నేను రెండు కోట్ల రూపాయలు తీసుకుంటానా అని ప్రశ్నించారు. వంగవీటి రంగా (vangaveeti ranga) వంటి వారు కమ్మవారి ఆడపడుచును పెళ్లాడారని గుర్తు చేశారు. వైసీపీ (YSRCP Government) కులాలను విడదీసే ప్రయత్నం చేస్తోందన్నారు. కులం కాదని.. గుణం చూసి ఓటేయాలన్నారు (Vote for Glass). తాను ప్రతి కులం గురించి ఆలోచిస్తానని చెప్పారు. రైతుల్లోను కులాల కుంపటి తెచ్చింది జగన్ ప్రభుత్వమే అన్నారు. మా దగ్గర డబ్బులు లేవని, మేం వాటిని పంచలేమని, కాబట్టి మీ ఓటును మీరే కొనుక్కొని, వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు (ministers and mlas) మాత్రం రూ.150 కోట్ల వరకు ఖర్చు పెట్టేంత డబ్బు ఉందన్నారు. ఎవరైనా గెలిచే కొద్దీ బలపడతారని, జనసేన (jana Sena) ప్రతి దెబ్బకు బలపడుతోందన్నారు. పులివెందుల సహా ప్రతిచోట 500 మంది క్రియాశీలక కార్యకర్తలను సంపాదించుకున్నదని చెప్పారు. నేను ఎప్పటికీ ప్రజలతోనే ఉంటానని హామీ ఇచ్చారు.
నేను ఎంతో ఇష్టపడిన ప్రధాని మోడీని (prime minister of india, Narendra Modi) రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Status) కోసం ఎదిరించవలసి వచ్చిందన్నారు. తాను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పానంటే చాలా కారణాలు ఉన్నాయని, బీజేపీతో (BJP) పొత్తు పెట్టుకొని, తాము అనుకున్న ప్లాన్ అమలు చేసి ఉంటే, తెలుగు దేశం పార్టీ అవసరం లేకుండానే ఎదిగే వాళ్లమని చెప్పారు. అమరావతే రాజధాని అని చెప్పి, లాంగ్ మార్చ్ చేద్దామని భావించామని, ఢిల్లీ అగ్రనాయకత్వం ఇందుకు అంగీకరించిందని, కానీ ఏపీకి వచ్చాక బీజేపీ స్థానిక నాయకుడు ఒకరు అలాంటిదేమీ లేదన్నారని చెప్పారు. బీజేపీకి అండగా ఉంటానని నేను చెబుతుంటే, వారు కలిసి రావడం లేదని, అందుకు తాను ఏం చేస్తానన్నారు. నేను నష్టపోయినా రాష్ట్రం నష్టపోవద్దు కాబట్టి టీడీపీతో పొత్తు కోసం ఆలోచిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ లేదా చంద్రబాబు పైన తనకు ప్రత్యేక అభిమానం అంటూ ఏమీ లేదని, కానీ ఆయన సమర్థులనే గౌరవం మాత్రం ఉందన్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఒక్కటి కావొద్దని వైసీపీ కోరుకుంటోందని, అందుకే తనకు దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయమని సవాల్ విసురుతోందన్నారు. కానీ ఏం జరిగితే బాగుంటుందని మీరంతా కోరుకుంటున్నారో.. అదే జరుగుతుందని చెప్పారు. ఓటును వృథా కానివ్వం.. అలాగే జనసేన సత్తా చాటుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో జనసేనది బలమైన సంతకం అవుతుందన్నారు. తాను గతంలో రెండుచోట్ల ఓడిపోయినా ప్రజల కోసమే పోరాడుతున్నానని, గెలవకుండానే ఇన్ని పోరాటాలు చేసామని, గెలిస్తే ఎలా చేస్తామో ప్రజలు తెలుసుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఆవిర్భావ సభను గెలిచి, చేసుకుందామన్నారు. కచ్చితంగా గెలుస్తుందంటే ఒంటరి పోరుకు కూడా సిద్ధమని, నివేదికలు తెప్పించుకుంటానని చెప్పారు. నాకు వేయాల్సింది గజమాల కాదు.. ఓటు, నా ముందుకు వచ్చి గుండెలు బాదుకోవడం కాదు.. గుండెల్లో పెట్టుకొని ఓటు.. అప్పుడు మీకు, రాష్ట్ర హితం కోసం ఏ నిర్ణయమైన తీసుకుంటానని చెప్పారు.