నేడు ముంబయి ఇండియన్స్(Mumbai Indians) టీమ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata night Riders) తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యాడు.
నేడు ఐపీఎల్(IPL 2023)లో రెండు కీలక మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్(Mumbai Indians) జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata night Riders) జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. వాంఖాడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు.
ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అస్వస్థతకు గురయ్యారు. రోహిత్ శర్మ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో అతడి స్థానంలో కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) కొనసాగనున్నాడు. టాస్కు సూర్యకుమార్ యాదవ్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. రోహిత్ శర్మ(Rohit Sharma)కు బదులుగా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడని, రోహిత్ ఆరోగ్యం(Health) బాలేదని కామెంటర్ డువాన్ జాన్సెన్ వివరించాడు.
రోహిత్ శర్మ(Rohit Sharma) మ్యాచ్ మధ్యలో కోలుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే రోహిత్ ఈ మ్యాచ్ లో ఆడే అవకాశాలు ఎక్కువగా లేవని క్రికెట్ (Cricket) విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఐపీఎల్(IPL) మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్(Mumbai Indians) ఇప్పటి వరకూ 3 మ్యాచ్‌లు ఆడింది. అయితే ఇందులో ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata night Riders) జట్టు 4 మ్యాచులు ఆడగా రెండింటిలో విజయం సాధించింది. ఇకపోతే ఈ రోజు జరిగే మరో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు తలపడనున్నాయి.