ADB: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా కోరారు. బచావో- బేటి పాడావో కార్యక్రమం భాగంగా గురువారం పట్టణంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దీంతో చిన్నారి యొక్క శారీరక, మానసిక ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుందన్నారు. తక్కువ వయసులో వివాహంతో విద్యా అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.