సౌరభ్ గంగూలీ (Saurabh Ganguly), విరాట్ కోహ్లిల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లున్నాయి. శనివారం బెంగళూరు (Bangalore)-దిల్లీ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయ సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకున్నారు.
బీసీసీఐ (BCCI) మాజీ చీఫ్,సౌరభ్ గంగూలీ, విరాట్ కోహ్లి(Virat Kohli)ల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లున్నాయి. శనివారం బెంగళూరు-దిల్లీ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయ సిబ్బంది పరస్పరంషేక్ హ్యాండ్ చేసుకున్నారు.ఈ సందర్భంగా దిల్లీ జట్టు క్రికెట్ డైరెక్టర్ అయిన సౌరభ్గంగూలీ (Saurabh Ganguly) దగ్గరికి వచ్చేసరికి కోహ్లి పట్టించుకోనట్లు ఉన్నాడు. దిల్లీ కోచ్ పాంటింగ్ (Delhi coach Ponting) తో వైపు చూస్తూ మాట్లాడాడు. గంగూలీ అతణ్ని దాటి ముందుకు వెళ్లి వేరే ఆటగాడితో కరచాలనం చేశాడు. టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా తనపై వేటు పడటంలో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీనే కారణమని విరాట్ భావిస్తూ అతడిపై పరోక్ష విమర్శలు చేయడంతో వీరి మధ్య అగాథం ఏర్పడ్డ సంగతి తెలిసిందే. గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ కేపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. బెంగళూరు(Bangalore)లో జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా మాజీ సారథి అయిన గంగూలీ ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals) డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా, కోహ్లీ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయని మరోసారి తేటతెల్లమైంది..