రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగళూరు 112 పరుగుల భారీ తేడాతో విక్టరీని నమోదు చేసింది. ఈ విజయంతో ఆర్సీబీ(RCB) పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది.
నేటి ఐపీఎల్(IPL 2023) మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు ఘన విజయం సాధించింది. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. మ్యాచ్ లో భాగంగా మొదటగా టాస్ గెలిచిన ఆర్సీబీ(RCB) బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ పాప్ డుప్లెసిస్ 55 పరుగులు, గ్లెన్ మాక్స్ వెల్ 54 పరుగులు చేశారు.
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టుకు ఆరంభంలో షాక్ తగిలింది. భీకర ఫాంలో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) ను సిరాజ్ డకౌట్ చేశారు. ఆ తర్వాత ఓవర్లోనే రాజస్థాన్ కు మరో గట్టిదెబ్బ తగిలింది. వేన్ పార్నెల్ బౌలింగ్ లో స్క్వేర్ కట్ కొట్టబోయిన ఓపెనర్ జోస్ బట్లర్ ఔట్ అయ్యాడు. అదే ఓవర్లో కెప్టెన్ సంజూ శాంసన్ (4) కూడా అవుట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ 7 పరుగులకే 3 వికెట్లు సమర్పించుకుంది.
రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగళూరు 112 పరుగుల భారీ తేడాతో విక్టరీని నమోదు చేసింది. ఈ విజయంతో ఆర్సీబీ(RCB) పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ఆర్సీబీ(RCB) విజయం సాధించడంతో అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.