Dinesh Karthik: RCB ఆటగాడు దినేష్ కార్తీక్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో డెత్ ఓవర్ల లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాటర్‌గా అవతరించాడు. అలాగే డెత్ ఓవర్లలో అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాటర్ కూడా దినేష్ కార్తీకే కావడం గమనార్హం. 2022 నుంచి ఐపీఎల్లో నమోదైన గణాంకాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. డెత్ ఓవర్లలో అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 280 గా ఉండడం విశేషం. అలాగే 203.27 స్ట్రైట్ రేట్‌తో 2022 నుంచి ఇప్పటివరకు డెత్ ఓవర్లలో 372 పరుగులు చేశాడు. ఇక అత్యధిక పరుగులు చేసిన వారిలో దినేష్ కార్తీక్ కంటే ముందు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మేయర్ ఉన్నారు. అతడు 383 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్- 197.42గా నమోదై ఉంది.
ఇక ఈ జాబితాలో ఉన్న టాప్-5 ఆగటగాళ్లలో మిగతా ముగ్గురు ఆటగాళ్లు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన రింకూ సింగ్,ముంబై ఇండియన్స్ ప్లేయర్ టీమ్ డేవిడ్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఉన్నారు. రింకూ సింగ్ 351 పరుగులు చేసి 195 స్ట్రైక్ రేట్ సాధించాడు. అదే విధంగా ముంబై ఇండియన్స్ ప్లేయర్ టీమ్ డేవిడ్ 290 పరుగులు చేసి, 207.14స్ట్రైక్ రేట్ సాధించాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ 285 పరుగులు సాధించి 161.01 స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. ఇక మార్చి 25వ తేదీన పంజాబ్ కింగ్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూర్ జట్టు విజయం సాధించింది. విరాట్ కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్‌కి తోడు చివరలో దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్ మెరుపులు మెరిపించడంతో బెంగళూరు 4 వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ఇందులో దినేష్ కార్తీక్ కేవలం 10 బంతుల్లోనే 28 రన్స్ చేయడం విశేషం. దాంతో ఆర్సీబీ ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.