టీమిండియా ( Team India ) ఓపెనర్ ఇంటర్మీడియట్ పాసైంది. 80శాతానికి పైగా మార్కులు సాధించినట్లు సోషల్ మీడియాలో వెళ్లడించింది. భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ ( shafali verma ) ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపింది. ఇటీవల వెళ్లడైన CBSE పరీక్షలో ఎగ్జామ్స్ ను క్లియర్ చేసినట్లు తెలిపింది. మార్క్స్ షీట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “ఈ సంవత్సరం మరోసారి 80శాతానికిపైగా మార్కులు సంపాదించాను. అయితే ఈ స్కోరు మ్యాచ్ లో అయితే కాదు. 12వ తరగతిలో వచ్చాయి. మంచి మార్కులతో పాసైనందుకు సంతోషిస్తున్నాను” అని షఫాలీ పోస్ట్ చేసింది.
షఫాలీ వర్మ తన 15ఏళ్ల వయసులో టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించింది. 2019లో దక్షిణాఫ్రికాపై తొలిమ్యాచ్ ను ఆడింది. మహిళల అండర్ -19 ప్రపంచకప్ ను తన సారథ్యంలో సాధించి చరిత్ర సృష్టించింది. భారత చరిత్రలో షఫాలీ మొట్టమొదటిసారి ఈఘటన సృష్టించిన క్రికెటర్ గా నిలిచింది. టీమిండియా తరపున 79మ్యాచ్ లు ఆడిన వర్మ21వేల పరుగులను చేసింది. 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ను అందుకుంది. దీంతో పాటే, మహిళల ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించింది.