పాకిస్తాన్ చేతిలో టీమిండియా(Team India) ఘోరంగా ఓడిపోయింది. ఇండియా-ఏ జట్టు ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్(Asia Cup) టోర్నీ ఫైనల్లో ఓడిపోయింది. పాకిస్థాన్-ఏ జట్టు 128 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియా-ఏ టీమ్ ను పాక్ చిత్తుగా ఓడించింది. 353 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన యువ భారత జట్టు 40 ఓవర్లలోనే 224 పరుగులకే ఆలౌట్ అయ్యి నిరాశ పరిచింది.
మ్యాచ్లో భాగంగా మొదట టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ తీసుకుంది. దీంతో పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. పాక్ ఆటగాడు తయ్యబ్ తాహిర్ 108 పరుగులు చేశాడు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగుల భారీ స్కోరు పాక్ చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత జట్టు మిడిలార్డర్ వైఫల్యంతో ఓటమి చవిచూసింది.
ఓపెనర్లు అభిషేక్ శర్మ 61, సాయి సుదర్శన్ 29 పరుగులు చేసి దూకుడుగా ఆడారు. కెప్టెన్ యశ్ ధూల్ 39 పరుగులు చేశాడు. పాకిస్థాన్-ఏ జట్టు బౌలర్లలో సూఫియాన్ ముఖీమ్ 3, అర్షద్ ఇక్బాల్ 2, మెహ్రాన్ ముంతాజ్ 2, మహ్మద్ వాసిం జూనియర్ 2 వికెట్లను పడగొట్టారు. మ్యాచ్ లో చివరి వికెట్ తీశాక పాకిస్థాన్-ఏ ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి.