»The Indian Captain Who Was Angry With The Umpire Was Fined Heavily
Harmanpreet kaur: ఔటిచ్చిన అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన భారత కెప్టెన్..భారీ జరిమానా!
ఉమెన్స్ వన్డే క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె తీరుతో ఐసీసీ ఆమెకు భారీ జరిమానాను విధించింది.
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) వివాదంలో చిక్కుకున్నారు. మ్యాచ్ తర్వాత అంపైరింగ్‌పై నిరసన వ్యక్తం చేసినందుకు ఆమెకు ఐసిసి భారీ జరిమానా విధించింది . హర్మన్‌పై కఠిన చర్యలు తీసుకున్న ఐసీసీ, కౌర్ మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానాను విధించింది. బంగ్లాదేశ్‌తో టీమిండియా(Team India) మూడో వన్డే మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ అంపైరింగ్‌ను ప్రశ్నించడమే కాకుండా బ్యాట్‌తో వికెట్‌ను కొట్టింది. అందరి ముందు తన కోపాన్ని చూపించింది.
కౌర్(Harmanpreet Kaur) ప్రవర్తనను మ్యాచ్ రిఫరీ ఇప్పుడు ఐసీసీకి నివేదించారని, నిబంధనల ప్రకారం హర్మన్‌ప్రీత్ కౌర్‌ను లెవల్ 2లో దోషిగా నిర్ధారించారని తెలిపారు. ఇందుకు గానూ 4డీ మెరిట్ పాయింట్లు విధిస్తున్నట్లు క్రిక్ బజ్ వెల్లడించింది. భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ జూలై 22న నిర్వహించారు. రెండు జట్ల మధ్య మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో రెండు జట్లూ సిరీస్‌లో సంయుక్త విజేతలుగా ట్రోఫీని షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాచ్ సమయంలో బంగ్లాదేశ్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur)పై క్యాచ్ ఔట్ కోసం అంపైర్‌ను అప్పీల్ చేసింది. బంగ్లాదేశ్ జట్టు విజ్ఞప్తిని అంగీకరించిన అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో ఆగ్రహం చెందిన కౌర్ వికెట్‌ను బ్యాట్‌తో కొట్టడమే కాకుండా తన్వీర్ అహ్మద్‌తో వాగ్వాదానికి దిగిన ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా హర్మన్ అంపైర్ నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేయడంతో ఐసీసీ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు భారీ జరిమానాను విధిస్తూ ప్రకటించింది.