Korea Open 2023: గెల్చుకున్న సాత్విక్, చిరాగ్ శెట్టి
ఆసియా ఛాంపియన్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు ఆదివారం కొరియాలోని యోసులో జరిగిన కొరియా ఓపెన్ 2023 టైటిల్‌ను గెల్చుకున్నారు. 17-21, 21-13, 21-14తో 1 ఇండోనేషియా ద్వయం ఫజర్ అల్ఫియాన్, ముహమ్మద్ రియాన్ ఆర్డియాంటోను ఓడించారు.
కొరియా ఓపెన్(Korea Open 2023) సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జులై 23న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో విజయం సాధించారు. ఇండోనేషియా టాప్ సీడ్లు ఫజర్ అల్ఫియాన్, ముహమ్మద్ రియాన్ ఆర్డియాంటోపై 17-21 21-13 21-14 తేడాతో మొదటిసారి గెలుపొందారు. సాత్విక్, చిరాగ్ ఈ ఏడాది ఇండోనేషియా సూపర్ 1000, స్విస్ ఓపెన్ సూపర్ 500 టైటిళ్లను గెలుచుకున్నారు. శనివారం ప్రపంచ రెండో ర్యాంకర్ చైనా జోడీ లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్‌లపై వరుస గేమ్‌ల తేడాతో భారత్ జోడీ విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది.
వీరిద్దరూ జతకట్టినప్పటి నుంచి సాత్విక్(Satwik), చిరాగ్(Chirag) కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం, థామస్ కప్ స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకం, సూపర్ 300 (సయ్యద్ మోడీ మరియు స్విస్ ఓపెన్), సూపర్ 500 (థాయ్‌లాండ్ మరియు ఇండియా ఓపెన్), సూపర్ 750 (ఫ్రెంచ్ ఓపెన్), ఇండోనేషియా ఓపెన్ సూపర్ 100తో సహా పలు టైటిళ్లను గెలుచుకున్నారు. BWF వరల్డ్ టూర్ ఆరు స్థాయిలుగా విభజించబడింది. అవి వరల్డ్ టూర్ ఫైనల్స్, నాలుగు సూపర్ 1000, ఆరు సూపర్ 750, ఏడు సూపర్ 500 మరియు 11 సూపర్ 300. టోర్నమెంట్‌లోని మరో వర్గం BWF టూర్ సూపర్ 100 స్థాయి కూడా ర్యాంకింగ్ పాయింట్లను అందిస్తుంది.