»Icon Foundation Scholarship Test For Students Of Class 6 To 12 Skillioma
Scholarship test: 6-12వ తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్ టెస్ట్.. రూ.2 కోట్ల మనీ!
6 నుంచి 12వ తరగతి(class 6 to 12th students) చదువుతున్న విద్యార్థుల కోసం ఆన్ లైన్(online) స్కాలర్ షిప్ టెస్ట్(Scholarship test) నిర్వహించనున్నట్లు ఐకాన్ ఫౌండేషన్(icon foundation) వ్యవస్థాపకులు చింతలూరి క్రిష్ వెల్లడించారు. ఈ పరీక్షలో మెరిట్ వచ్చిన రెండు వేల మందికి రెండు కోట్ల రూపాయల స్కాలర్ షిప్(Scholarship) అందించనున్నట్లు తెలిపారు.
మీ పిల్లలు 6 నుంచి 12వ తరగతి(class 6 to 12th students) చదువుతున్నారా. అయితే గుడ్ న్యూస్. ఎంటంటే ఐకాన్ ఫౌండేషన్(icon foundation) ఓ స్కాలర్ షిప్ నిర్వహిస్తోంది. ఈ టెస్టులో మెరిట్ వచ్చిన రెండు వేల మందికి రెండు కోట్ల రూపాయల స్కాలర్ షిప్(Scholarship test) ను కూడా అందిచనున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. అయితే ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల వివరాలను నమోదు చేసుకోండి. దేశవ్యాప్తంగా(national wide) ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు ఐకాన్ ఫౌండేషన్(icon foundation) వ్యవస్థాపకులు చింతలూరి క్రిష్ తెలిపారు.
ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యాన్ని పెంచుకునేందుకు ఈ ఆన్ లైన్(online)ఎగ్జామ్(exam) నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మెరిట్(merit) ప్రకారం 2 వేల మందికి ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత వారికి 2 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ కూడా అందిస్తామని స్పష్టం చేశారు. అందుకోసం ఆయా విద్యార్థులు ఈ లింక్ క్లిక్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. https://www.skillioma.com/merit-scholarship-enrollment/. అయితే ఏప్రిల్ 1వ తేదీలోగా మాత్రమే విద్యార్థులు(students) దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పరిధిలోని వెక్స్ కార్యాలయంలో ఆయన శనివారం బ్రోచర్(brochure)ను విడుదల చేసి వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు చింతలూరితోపాటు పలువురు పాల్గొన్నారు.