»Holi Effect Wine Shops Closed For Two Days March 6th To March 8th 2023 Hyderabad Secunderabad
Holi Effect: రెండు రోజులు వైన్ షాపులు బంద్
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రెండు రోజుల పాటు వైన్ షాపులు హైదరాబాద్, సికింద్రాబాద్(hyderabad secunderabad) ప్రాంతాల్లో బంద్ కానున్నాయి. హోలీ పండుగ(Holi effect) సందర్భంగా మార్చి 6న సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు(Wine shops) బంద్ కానున్నాయి. ఈ మేరకు రాచకొండ సీపీ(CP) డీఎస్ చౌహన్ ప్రకటించారు.
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రెండు రోజుల(two days) పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. అయితే హోలీ పండుగ(Holi festival) నేపథ్యంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్చి 6న సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల(march 6th to march 8th 2023) వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ నేపథ్యంలో జంట నగరాల(hyderabad secunderabad) పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు మూసీ వేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు హైదరాబాద్, సికింద్రాబాద్(hyderabad secunderabad) తోపాటు తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాలు(Wine shops) బంద్ కానున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు హోలీ పండుగ వేళ యువత సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు(police) హెచ్చరించారు. తెలియని వారిపై ఇష్టం వచ్చినట్లు రంగులు(colors) వేయకూడదని సూచించారు. దీంతోపాటు ఇతరుల వాహనాలు, భవనాలు సహా పలు చోట్ల కలర్లు(colors) పోయకూడదని కోరారు. అయితే ఈ ఆంక్షలు పెట్టడం ఇప్పుడు కొత్త ఏమి కాదని పలువురు అంటున్నారు. గత ఏడాది కూడా హోలీ పండుగ(Holi festival) సందర్భంగా మద్యం షాపులు బంద్ చేశారని మద్యం ప్రియులు గుర్తు చేస్తున్నారు.