»Accused In Viveka Murder Case Umashankar Reddy Wife Was Threatened At Pulivendula
Viveka Murder Case: లో నిందితుడు ఉమాశంకర్ భార్యకు బెదిరింపు
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. భార్య స్వాతిని ఇద్దరు బెదిరించినట్లు ఆమె ఫోన్ ద్వారా పోలీసులకు తెలిపింది.
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Viveka murder case)లో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. భార్య స్వాతిని ఇద్దరు బెదిరించినట్లు ఆమె ఫోన్ ద్వారా పోలీసులకు తెలిపింది. అయితే ఎస్పీ(SP) అన్బురాజన్ కు ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మేసెజ్ చేసినట్లు వెల్లడించింది. పులివెందుల(pulivendula)లో ఉంటున్న స్వాతి ఇంట్లో శనివారం ఇద్దరు దుండగులు వచ్చి వివేకానంద రెడ్డిని నీ భర్తనే కదా అని ఆమెపై దాడి చేయబోయారని చెప్పింది.
తర్వాత స్పందించిన ఎస్పీ..సిబ్బందికి చెప్పడంతో ఆమె ఇంటి వద్దకు పలువురు పోలీసులు(police) చేరుకున్నారు. అప్పటికే ఆమె నుంచి దుండగులు పారిపోయినట్లు గుర్తించారు. కానీ ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ఇద్దరు అనుమానితులను అదులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారిని కడప(kadapa)కు తరలించామని వారిని వివరాలు ఆరా తీసిన తర్వాత మరింత సమాచారం చెబుతామని అధికారులు అన్నారు.
ఈ కేసులో సీబీఐ(CBI) అధికారులు ఎంక్వైరీని స్పీడప్ చేశారు. ఎవరిపై సందేహాం కలిగినా కూడా నోటీసులు ఇచ్చి మరీ విచారిస్తున్నారు. ఇప్పటికే పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్‌ను (sudhakar) విచారించారు. కడపలో వివిధ అంశాలపై 2 గంటల పాటు (2 hours) విచారించారు. ఎంపీ అవినాష్‌రెడ్డితో (avinash reddy) ఫోటో దిగిన విషయంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు వివేకా ఇంటికి వచ్చిన వారిలో కొందరిని సీబీఐ విచారణకు పిలిచింది. వివేకానందరెడ్డి(YS Vivekananda reddy) హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి (Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీచేసింది. వివేకా హత్య జరిగిన రోజు సంఘటన స్థలంలో సాక్ష్యాధారాలు చెరిపేయడం, హత్య వెనుక కుట్రను ఛేదించేందుకు ఆయనను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఈ కేసులో ఇప్పటికే సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డిలో సీబీఐ అధికారుల విచారణలో ఉన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్దీ రోజుల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి (vivekananda reddy) చనిపోయారు. అతని మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో సిట్ (sit) దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత వివేకా (viveka) కూతురు కోరడంతో కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో రోజుకో పేరు రావడం.. వారిని విచారణకు పిలువడం జరుగుతూనే ఉంది.