»Chandrababu Comments Ambotu Rambabu Are You A Minister Or A Movie Broker
Chandrababu: అంబోతు రాంబాబు నువ్వు మంత్రివా..సినిమా బ్రోకర్ వా?
ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో చంద్రాబాబు నాయుడు(Chandrababu Naidu) పర్యటించిన నేపథ్యంలో సీఎం జగన్ మెహన్ రెడ్డి సహా మంత్రి అంటి రాంబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నువ్వు మంత్రివా లేదా సినిమా బ్రోకర్ వా అని చంద్రాబాబు ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఏపీలోని పులివెందుల(pulivendula)లో పర్యటించిన సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా మంత్రి అంబటి రాంబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సైకో ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏం చేశాడని ప్రశ్నించారు. ఏది మీ రాజధాని అని అడిగారు. మన రాజధాని ఏదంటే మీ పిల్లలకు ఏం చెబుతారని గుర్తుచేశారు. ఐదేళ్లైనా కూడా ప్రజలకు రాజధాని లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. పులివెందుల నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ ఏదని, రాష్ట్రం తలలేని మొండెం మాదిరిగా తయారైందని అన్నారు. పులివెందుల నుంచి రాజధాని కోసం విశాఖపట్నం పోవాలని ఈ సీఎం చెబుతున్నారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని చంద్రాబాబు వ్యాఖ్యానించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఏడు మండలాలు తెప్పించి పోలవరంను 70 శాతానికి పైగా పూర్తి చేసినట్లు టీడీపీ అధినేత అన్నారు. కానీ ఈ సీఎం వచ్చి ఏజెన్సీని, కంట్రాక్టును అన్నింటిని మార్చి ఇంతవరకు పూర్తి చేయాలేదని వెల్లడించారు. పోలవరం పూర్తైతే ఈ రాయలసీమ ఒక మణిపూసగా తయారయ్యేదని అన్నారు. కానీ తాను మళ్లీ వస్తానని, పోలవరం ప్రాజెక్టును బాగుచేసి పూర్తిచేస్తానన్నారు. సీమలో ప్రతి ఎకరానికి నీరు అందిస్తానని చంద్రబాబు వెల్లడించారు.
మరోవైపు రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు(ambati rambabu) ఉన్నా లేనట్లేనని పేర్కొన్నారు. అంబోతు రాంబాబు ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా పవన్ కల్యాణ్ బ్రో సినిమాపై పడ్డారని వ్యాఖ్యానించారు. రాంబాబు అసలు నువ్వు మంత్రివా లేదా సినిమా బ్రోకర్ వా అంటూ నిలదీశారు. కనీసం మంత్రి అన్న హుందా తనం, పద్దతి పాడు లేకుండా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. చిన్న అంశాన్ని పట్టుకుని పరువు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం తమ ప్రభుత్వం దాదాపు రూ.12000 కోట్లు ఖర్చు చేస్తే, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 2000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులను స్వల్పకాలిక ఎన్నికల లాభాల కోసం ఖర్చు చేస్తోందని ఆరోపించారు.