KA Paul: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ (KA Paul) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమతో కలిసి పనిచేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. నాలుగేళ్ల నుంచి అడుగుతున్న లెక్క చేయడం లేదన్నారు. తమతో కలిసి పనిచేస్తే మంచిదని.. రెండు పార్టీలకు మేలు జరుగుతుందని వివరించారు. పవన్ మాత్రం మోడీ ముద్దు అంటున్నారని ఒకింత ఆగ్రహాం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఢిల్లి వెళితే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని తెలిపారు. తనది మరో లెవల్ అని చెబుతున్నారు. ఈ క్షణం ఢిల్లీ వెళ్లినా మోడీ, అమిత్ షా తనను వెంటనే కలుస్తారని వివరించారు. వారితో తనకు అవసరం లేదని చెప్పారు.
పవన్ కల్యాణ్‌కు (pawan kalyan) నిలకడ లేదు.. నిలకడగా ఉండాలని, ప్రజాశాంతి పార్టీతో జనసేన కలిస్తే ఓటుబ్యాంక్ పెరుగుతుందని వివరించారు. నిలకడ లేక.. కాపులందరూ పవన్ కల్యాణ్‌కు దూరం అయ్యారని పేర్కొన్నారు. ఈ విషయం ఆయన ఇప్పటికీ గ్రహించడం లేదని తెలిపారు. పవన్ మోడీకి (modi) మద్దతు ఇవ్వడం వల్ల కొందరు నేతలు ఆయన నుంచి తప్పుకున్నారని పాల్ గుర్తుచేశారు. రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ, రావెల కిశోర్ బాబు వంటి నేతలు జనసేన పార్టీని వదిలేయడానికి కారణం.. పవన్ మోడీకి మద్దతు తెలుపడమేనని గుర్తుచేశారు. ఏపీని నాశనం చేసింది మోడీ అని గుర్తుచేశారు.
తాను పెద్ద కాపుని అని కేఏ పాల్ (KA Paul) అంటున్నారు. మున్నూరు కాపు.. బీసీని అని గుర్తుచేశారు. బీసీలను, కాపులను తప్పుదోవ పట్టించొద్దని పవన్‌కు హితవు పలికారు. 4 శాతం ఓట్లను చీల్చవద్దని పవన్‌ను పాల్ కోరారు.