అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు వాతావరణం చల్లగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Rain: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్ సహా జిల్లాల్లో నిన్న వర్షం (Rain) పడింది. చలిగాలులు వీయడంతో జనం ఇబ్బంది పడ్డారు. మరో రెండు రోజులు వాతావరణం ఇలానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉంది. 26వ తేదీ వరకు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని.. భారీ వర్షాలు మాత్రం లేవని స్పష్టంచేసింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయని పేర్కొంది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. ఉదయం పొగమంచు కమ్మేస్తోందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం (Rains) నమోదైంది. నల్గొండ జిల్లా దామరచర్లో అత్యధికంగా 27.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పొగమంచు ప్రభావం వల్ల రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెబుతోంది. కొన్ని జిల్లాల్లో 20 డిగ్రీల కన్నా తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 15.7 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 15.9, ఆదిలాబాద్‌లో గల భోరజ్‌లో 16.2, వికారాబాద్ జిల్లా మర్పల్లి, నిర్మల్ జిల్లా 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.