Kamala Haasan says he will give good news in two days
Kamala Haasan: రెండు రోజుల్లో ఓ శుభవార్త చెబుతానని సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) పార్టీ అధినేత కమల హాసన్(Kamala Haasan) వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన మాటలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని, తమకు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో తమిళనాడులోని ప్రజలు, అభిమానులు ఉత్సహంగా ఉన్నారు. ప్రస్తుతం కమల హాసన్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. ఈ మధ్య తలపతి విజయ్ రాజకీయ పార్టీని స్థాపించారు. తమిళగ వెట్రి కళగం పార్టీ కూడా స్పీడ్ పెంచింది.