మేషం: కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఆదాయం పర్వాలేదు. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ జీవితం సాధారణంగా సాగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది.
వృషభం:వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో లేదా కుటుంబీకులతో కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు పర్వాలేదు.
మిథునం: వ్యాపారాలలో లాభాలు సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్త్రీ సంబంధ వ్యవహారాలలో జాగ్రత్త. బంధుమిత్రుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది. కొత్త విషయాల్లో ఆసక్తి చూపుతారు. కుటుంబీకులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి ఏ ఇబ్బంది రాదు.
కర్కాటకం: మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సాగుతుంది. శత్రువులు కూడా మిత్రువులవుతారు. సమాజంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనితీరు మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. దూర ప్రాంత పిల్లల నుంచి గుడ్ న్యూస్లు వింటారు.
సింహం: వ్యాపారాల్లో కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా అడుగేయండి. దైవ కార్యాల్లో పాల్గొని పూజలు చేస్తారు. రాజకీయంగా కార్యకలాపాలు మరింత పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. అన్ని వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. తెలిసిన వారు మీ డబ్బును నష్టపరిచే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు కాస్త దూరంగా ఉంటే మంచిది.
కన్య: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో, ముఖ్యంగా ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, అవివాహితుల పెళ్లి ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.
తుల: ఇంటా బయటా మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. తోబుట్టువులతో కొద్దిగా వివాదాలు తలెత్తుతాయి. వ్యాపార వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. సంపాదనకు ఏ లోటు ఉండదు. శుభవార్తలు వింటారు.
వృశ్చికం: ఆదాయం బాగుంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యానికి గురవుతారు. కుటుంబ పరిస్థితులకు ఏ ఇబ్బంది ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ దర్శనాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల వద్ద విలువ, గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు తగ్గుతాయి. బంధువుల నుంచి సమస్యలు వస్తాయి.
ధనుస్సు : నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆదాయం మెరుగవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు అద్భుతంగా ఫలిస్తాయి. మిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. కుటుంబీకుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు.
మకరం : ఆదాయం నిలకడగా ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. వృథా ఖర్చుల వల్ల ఇరకాటంలో పడతారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి ఎదురవుతుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. దైవ కార్యాలలో పాల్గొని పూజలు చేస్తారు. కుటుంబీకుల నుంచి శుభవార్తలు వింటారు.
కుంభం: రాజకీయాలు, రియల్ ఎస్టేట్, వైద్యం, మద్యం తదితర రంగాల వారికి మంచి జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల నుంచి ధన సాయం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో సాగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.
మీనం: వృత్తి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యతగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల వ్యవహారాలలో కల్పించుకోకపోవడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాల్లో కొత్త ప్రణాళికలు వేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఆదాయం అంతగా ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరిగి దేవాలయాలు దర్శిస్తారు. కుటుంబ జీవితం అంత ప్రశాంతంగా ఉండదు.