ఇప్పుడంటే లవర్ బాయ్ హీరో అంటే ఠక్కున చెప్పడం కష్టం కానీ.. ఒక దశాబ్దం ముందుకి పోతే.. దాదాపుగా తరుణ్ పేరే చెబుతారు. కానీ గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు తరుణ్. దాంతో తరుణ్ మళ్లీ రీ ఎంట్రి ఇస్తే బాగుటుందని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా తరుణ్(Tarun) రీ ఎంట్రీ పై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.
‘అంజలి’ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన తరుణ్(hero Tarun).. ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకొని యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ‘ప్రియమైన నీకు’, ‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వే నువ్వే’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.
ఈ సినిమాలతో టాలీవుడ్ లవర్ బాయ్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కొన్నాళ్ల తర్వాత.. మెల్లిగా ఫేడ్ అవుట్ అయిపోయాడు తరుణ్. వరుస ప్లాపులు రావడంతో.. సినిమాలకు బ్రేక్ ఇచ్చేశాడు. చివరగా 2018లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా చేశాడు. అప్పటి నుంచి తరుణ్ మళ్లీ బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు.
అయితే గత కొన్ని రోజులుగా తరుణ్ రీ ఎంట్రీ(re entry) గురించి వార్తలు వస్తునే ఉన్నాయి. తరుణ్ రీ ఎంట్రీ ఇస్తే చూడాలని అంటున్నారు చాలామంది. కానీ దీనిపై క్లారిటీ రావడం లేదు. తాజాగా తరుణ్ తల్లి రోజా రమణి.. ఓ ఇంటర్య్వూలో త్వరలోనే తరుణ్ రీ ఎంట్రీ ఉంటుందని చెప్పేశారు.
వెబ్ సిరీస్‌తో పాటు ఓ సినిమా కూడా చేయబోతున్నాడని తెలిపారు. దీంతో మళ్లీ హీరోగా తరుణ్ ఖచ్చితంగా రాణిస్తాడని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే తరుణ్ పెళ్లి కూడా తొందరలోనే అవుతుందంటూ పేర్కొన్నారు.
దీంతో తరుణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తరుణ్ నుంచి ముందుగా వెబ్ సిరీస్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి సెకండ్ ఇన్నింగ్స్‌లో తరుణ్ ఎలా రాణిస్తాడో చూడాలి.