BJP MLA Raja Singh: పార్టీ అధిష్టానానికి అల్టిమేటం.. కానీ!
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తమ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయకుంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు. తనకు ఇతర పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఉద్దేశం లేదన్నారు. అయితే తనకు బీజేపీ నాయకత్వం తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తమ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తనపై సస్పెన్షన్ వేటు (rajasingh suspension) ఎత్తివేయకుంటే తాను వచ్చే ఎన్నికల్లో (Assembly Elections) పోటీకి దూరంగా ఉంటానని తేల్చి చెప్పారు. తనకు ఇతర పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఉద్దేశం లేదన్నారు. అయితే తనకు బీజేపీ (BJP) నాయకత్వం తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. తెలంగాణ పార్టీలో (Telangana) బండి సంజయ్ (Bandi Sanjay) తనకు శ్రీరామరక్ష (Sri Rama Raksha) అని చెప్పారు. సస్పెన్షన్ అంశాన్ని ఆయన చూసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. తన ప్రవర్తన వలన పార్టీకి ఎలాంటి నష్టం కలగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళే ఆలోచన కూడా తనకు లేదని చెప్పారు. తాను ధర్మం కోసం మాత్రమే పని చేస్తానని తేల్చి చెప్పారు. తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ పైన కేంద్ర హోంశాఖకు (home department) లేఖ రాస్తున్నట్లు తెలిపారు. బెదిరింపు కాల్స్ పైన తెలంగాణ రాష్ట్ర డీజీపీకి (DGP of Telangana) ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఇంటెలిజెన్స్ (intelligence bureau) హెచ్చరికల నేపథ్యంలోనే తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం (bullet proof vehicle) మార్చారన్నారు. ఇప్పుడు వచ్చిన వాహనమైనా మంచిగా పని చేస్తోందని భావిస్తున్నట్లు చెప్పారు.
రాజా సింగ్ పైన బీజేపీ (BJP) కొద్ది నెలల క్రితం సస్పెన్షన్ వేటు (rajasingh suspension) వేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో (Hyderabad) స్టాండప్ కమెడీయన్ (standup comedian) మునావర్ ఫారూఖీ షో (munawar faruqui show) వద్దని చెప్పినా, కార్యక్రమం నిర్వహించడంపై సోషల్ మీడియాలో (Social Media) రాజాసింగ్ వీడియోను (Raja Singh Video) రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ప్రవక్తపై ప్రశ్నలు కురిపించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మజ్లిస్ పార్టీ (MIM) ఆరోపించింది. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని నిరసన కూడా తెలిపింది. అయితే గతంలో అక్బరుద్దీన్, అసదుద్దీన్ హిందూ దేవతలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏం చేశారనే ప్రశ్న రాజాసింగ్ (Raja Singh) అభిమానుల నుండి వినిపించింది. అదే సమయంలో హిందూ దేవతలను కించపరిచే మునావర్ ఫారుఖీ షోకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రక్షణ కల్పించిందనే ప్రశ్నలు వినిపించాయి. ఈ అంశాలు పక్కన పెడితే, ప్రవక్తపై వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని చెబుతూ, బీజేపీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఆయన పై సస్పెన్షన్ ను ఎత్తివేస్తుందనే అభిప్రాయంతో ఆయన అభిమానులు ఉన్నారు.
ఇదిలా ఉండగా, రాజాసింగ్కు ప్రభుత్వం ఇటీవల కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. గతంలో ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తుండటంతో ఆయన ఎన్నోసార్లు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి, డీజీపీ దృష్టికి తీసుకు వెళ్లారు. అయినా స్పందన కనిపించలేదు. దీంతో ఇటీవలే పాత వాహనాన్ని ప్రగతి భవన్ వద్ద వదిలి పెట్టి వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చింది. 2017 మోడల్ ఫార్చ్యూనర్ కారును రాజసింగ్ కు కేటాయించింది.