»Gang Of Fake Notes Arrested In Hyderabad 13 People Among Them 2023
Fake notes gang: హైదరాబాద్లో ఫేక్ నోట్ల ముఠా అరెస్ట్..అదుపులో 13 మంది
హైదరాబాద్లో(hyderabad) మరో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు(police) చేధించారు. దీంతోపాటు 13 మంది అరెస్టు చేసి వారి నుంచి 30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
భాగ్యనగరం(Hyderabad)లో ఫేక్ నోట్ల ముఠా(Fake notes gang)ను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో వారి నుంచి 30 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 13 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు చెందిన వారు కూడా ఉన్నారని పోలీసులు(police) వివరాలను వెల్లడించారు.
అయితే ఈ ముఠా నాలుగు రాష్ట్రాల్లో ఫేక్ కరెన్సీని ఆపరేట్ చేస్తుందని పోలీసులు తెలిపారు. ఆ క్రమంలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఏపీలో వారు నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్లు సీపీ(CP) స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. అయితే నిందితుల్లో రాజేష్ అనే వ్యక్తి ప్రధానంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అతను ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో డ్యాన్స్ టీచర్ గా పని చేస్తున్నట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో రాజేష్ కు లక్ష రూపాయలు ఇస్తే మూడు లక్షల రూపాయల నకిలీ కరెన్సీని ఇస్తూ దాందా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని తెలిపారు. రాజేష్ చెన్నై వెళ్లి ఈ ఫేక్ నోట్లను మారుస్తున్నట్లు సీపీ వెల్లడించారు.