janasena party alliance with bjp in telangana assembly elections 2023
తిరుమల తిరుపతి అలిపిరి కాలినడక పరిధిలో మరో ఐదు చిరుతలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అవి సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తిరుపతి ఏడో మైలు, నామాలగవి, లక్ష్మినరసింహ స్వామి ఆలయం పరిసరాల్లో అవి తిరుగుతున్నట్లు చెప్పారు. అయితే వాటిని ట్రాప్ చేసిన సీసీ కెమెరాల దృశ్యాల ద్వారా వాటిని గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మరోవైపు అలిపిరి నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అంటున్నారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు. మధ్యాహ్నం జరిగే టీటీటీ హైలెవల్ మీటింగులో కీలక నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇప్పటికే అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు (srivari mettu) మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతిని టీటీడీ నిరాకరిస్తూ ప్రకటన చేసింది. రెండో ఘాట్ రోడ్డు (2nd Ghat Road)లో సాయంత్రం 6 గంటలు దాటితే టూవీలర్లను అనుమతించొద్దని టీటీడీ ఆదేశాలిచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులపై చిరుత దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చర్చ మొదలైంది.