Nellore కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం.. పత్రాలన్నీ దగ్ధం
నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గతంలోనే రెండు సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. అప్పుడు కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి అనేక కేసులకు సంబంధించిన పత్రాలు దహనమయ్యాయి. అప్పుడు ఆ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. తాజాగా జరిగిన ప్రమాదంలో మరికొన్ని పత్రాలు మంటల్లో కాలిపోయాయి. ఏ పత్రాలు తగలబడ్డాయో ఇంకా తెలియరాలేదు.
నెల్లూరు పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం (Nellore District Collectorate,)లో అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. కార్యాలయం వెనుకలో ఉన్న స్టోర్ రూమ్ (Store Room)లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కార్యాలయంలోని సామగ్రి, ఫర్నీచర్ అగ్ని ఆహుతయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు పట్టణంలోని వెనుక వైపు ఉన్న స్టోర్ రూమ్ లో శనివారం మధ్యాహ్నం మంటలు వ్యాపించాయి. మంటల వ్యాప్తి సమాచారం అందుకున్న సిబ్బంది అక్కడికి వెళ్లి పరిశీలించారు. కలెక్టరేట్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వీరి ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire Department) చేరుకుని మంటలను ఆర్పేశారు. అయితే ప్రమాదంలో గదిలోని ఫర్నీచర్ బుగ్గిపాలైంది. విలువైన పత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ గదిలో భద్రపర్చిన ఎన్నికల సామగ్రి (Election) కూడా దహనమైంది. అయితే రెండో శనివారం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాదానికి గల కారణం ఇంతవరకు తెలియలేదు. పోలీసులు (Andhra Pradesh Police) వచ్చి కారణాలు తెలుసుకుంటున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తున్నది.
తరచూ ప్రమాదాలు
అయితే నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గతంలోనే రెండు సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. అప్పుడు కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి అనేక కేసులకు సంబంధించిన పత్రాలు దహనమయ్యాయి. అప్పుడు ఆ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. తాజాగా జరిగిన ప్రమాదంలో మరికొన్ని పత్రాలు మంటల్లో కాలిపోయాయి. ఏ పత్రాలు తగలబడ్డాయో ఇంకా తెలియరాలేదు. త్వరలోనే పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. తరచూ ప్రమాదాలు సంభవించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల సామగ్రి ఉన్న కార్యాలయంలోనే ప్రమాదం జరగడం పలు సందేహాలు మొదలవుతున్నాయి. గతంలో ఇదే మాదిరి ప్రమాదం జరిగింది. తాజాగా మళ్లీ అటువంటి ప్రమాదమే జరగడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రశ్నించే అవకాశం ఉంది.
వేసవికి ముందే హెచ్చరిక కాగా వేసవి కాలం సమీపిస్తుండడంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికంగా ఉంటాయి. ముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అగ్ని ప్రమాద నియంత్రణ సామగ్రి అన్ని కార్యాలయాల్లో సిద్ధం చేసుకోవాలి. వేసవి ముందే ప్రమాదం జరగడంతో ఇది హెచ్చరికగా భావించాలి. ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ చేసిన సూచనల ఆధారంగా అన్ని కార్యాలయాల్లో అగ్ని ప్రమాద నిరోధక యంత్రాలు సిద్ధం చేసుకోవాలి. ఇది ఒక్క నెల్లూరు జిల్లాకే కాదు రాష్ట్రవ్యాప్తంగా అగ్ని ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవాలి. దీనిపై ఉన్నత అధికారులు సమీక్ష చేయాలి.