GNTR: పెదకాకానిలో గంజాయి రవాణా వ్యక్తులను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉన్న పంజాబీ డాబా వద్ద గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని రవాణా చేస్తున్న నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పెదకాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1 కిలో గంజాయి, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.