»Eluru Andhra Pradesh Eluru Into Two Mandals Ap Sarkar Jio Issued
Eluru-Andhra Pradesh : రెండు మండలాలుగా ఏలూరు..ఏపీ సర్కార్ జీవో జారీ
ఏలూరును రెండు మండలాలుగా ఏపీ సర్కార్ విభజించింది. ఏలూరు అర్భన్, ఏలూరు రూరల్ మండలాలుగా రెవెన్యూ గ్రామాలు కొనసాగనున్నాయి. ఇందులో రూరల్ పరిధిలోకి 13, అర్భన్ లో 8 కొనసాగనున్నాయి.
ఏలూరు(Eluru)కు సంబంధించి ఏపీ సర్కార్(Ap Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఏలూరును రెండు మండలాలుగా విభిజిస్తూ జీవో(GO) జారీ చేసింది. ఏలూరు అర్బన్(Eluru Urban), ఏలూరు రూరల్(Eluru Rural) మండలాలుగా విభిజిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఏలూరు రూరల్ మండల కేంద్రాన్ని చాటపర్రులో ఏర్పాటు చేయనుంది. మొత్తం 13 రెవెన్యూ గ్రామాలుగా ఏలూరు రూరల్ మండలం కనిపించనుంది. ఈ విభజనకు సంబంధించి జీవోను సర్కార్ విడుదల చేసింది.
ఏలూరు జిల్లా(Eluru District)లో మొత్తం 21 గ్రామాలు ఉన్నాయి. వాటిలో13 రూరల్(Eluru Rural) మండల పరిధిలోకి, మిగిలిన 8 మండలాలు ఏలూరు అర్బన్(Eluru Urban) మండల పరిధిలో ఉన్నాయి. గతంలో ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఉండగా వైసీపీ సర్కార్ జిల్లాల పునర్విభజన చేసింది. ఆ సమయంలో ఏలూరు జిల్లాగా ఏర్పడగా ప్రస్తుతం రెండు మండలాలుగా విభజించబడింది.