ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy) ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) వ్యాఖ్యలు చేశారు. ప్రజలను భయపెట్టి ఎక్కువకాలం అధికారంలో కొనసాగలేరని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ కు జగన్ బ్రదర్ లాంటి వారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పులివెందులలో జగన్ ప్రజలను భయపెట్టి గెలిస్తున్నారని ఎద్దేవా చేశారు. కుప్పంలో ప్రజలు చంద్రబాబును అభిమానంతో గెలిపిస్తున్నట్లు గుర్తు చేశారు. హుద్ హుద్ వచ్చినా కూడా చెదరని విశాఖపట్నం ప్రస్తుతం వైసీపీ అక్రమాలకు చెదిరిపోతుందని అన్నారు. ప్రస్తుతం అస్తవ్యస్థంగా ఉన్న రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడమే తన లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు.