కోనసీమ: పి.గన్నవరం మండలం గంటి పెదపూడి గ్రామ సమీపంలో ఉన్న కాలువలో ఆదివారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం అదే గ్రామానికి చెందిన కాండ్రేగుల రామకృష్ణ (60)గా స్థానికులు గుర్తించారు. వీఆర్వో భగవన్నారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.