హైదరాబాద్(Hyderabad) కేంద్రంగా డ్రగ్స్ దందా సాగుతోంది. పోలీసులు దీనిపై గట్టి చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడోచోట ఈ చీకటి దందా సాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నగర శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో (Mailardevpally) పెద్ద మొత్తంలో మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను (Mephentermine sulphate injection) డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో 400 వరకు ఇంజెక్షన్లను అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా అధికారులు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిమ్ ట్రైనర్ (Zim trainer) నితీశ్, రాహుల్‌తోపాటు సోహెల్‌లను అధికారులు అరెస్ట్ చేశారు.
అయితే స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లను ఎక్కడి నుంచి తెచ్చారు, ఈ దందా వెనుక ఎవరున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఈ ఇంజెక్షన్లను ఎక్కువగా జిమ్‌లో బాడీబిల్డర్ల కోసం వాడి దుర్వినియోగం చేస్తున్నారని అధికారుల విచారణలో బయటపడింది. ఈ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.