దేశ రాజధాని దిల్లీ(Delhi)లో దారుణం జరిగింది.అప్పుతీసుకున్న వ్యక్తి దాడి నుంచి తమ సోదరుడిని కాపాడబోయిన ఇద్దరు యువతులు కాల్పులకు బలయ్యారు. నైరుతి దిల్లీలోని ఆర్కే పురం అంబేడ్కర్ బస్తీ(Ambedkar Basti)కి చెందిన లలిత్ అనే వ్యక్తి గతంలో ఒకరికి రూ.10 వేలు అప్పు(10 thousand loan)గా ఇచ్చాడు. ఇటీవల తాను ఇచ్చిన అప్పు మొత్తం తిరిగి చెల్లించాల్సిందిగా ఆ వ్యక్తిని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆదివారం అర్థరాత్రి 20 మంది వ్యక్తులు లలిత్ (Lalit)నివాసానికి వచ్చి తలుపులు బాదడంతోపాటు రాళ్లు రువ్వారు.
భయాందోళనలకు గురైన లలిత్ సోదరుడు లాల్ అదే వీధిలో ఉంటున్న తన సోదరీమణులు, ఇతర బంధువులను సమాచారం అందించారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. మరి కొద్దిసేపటికి వెనక్కి వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కాల్పుల్లో లలిత్ సోదరీమణులు పింకీ (Pinky)(30), జ్యోతి(29) తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. లలిత్కూ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అరుణ్, మిషెల్, దేవ్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీసీపీ మనోజ్ (DCP Manoj) వెల్లడించారు