జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి విజయ యాత్ర కాకినాడలో బహిరంగసభ నిర్వహించారు.ఈ సందర్బంగా పవన్ స్ధానిక ఎమ్మెల్యే ద్వారంపూడి (MLA Dwarampudi) చంద్రశేఖర్రెడ్డి పై తీవ్రస్ధాయిలో విమర్మించారు. ద్వారంపుడి సీఎం జగన్ (CM JAGAN) సపోర్టు చూసుకుని అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. చంద్రశేఖర్ రెడ్డి వైఖరి చూస్తుంటే గోదావరి జిల్లాలకు తానే సీఎం అన్నట్టుగా ఉందని విమర్శించారు. “ఇదే ప్రాంతానికి చెందిన అగ్నికుల క్షత్రియుడు, మత్స్యకార (fisherman) వర్గానికి చెందిన సత్యలింగ నాయకర్ 1800 సంవత్సరంలోనే బర్మా(Burma)వెళ్లి బాగా డబ్బు సంపాదించి, ఆ డబ్బు ఇక్కడికి తీసుకువచ్చి ఓ ట్రస్టు (Trust) స్థాపించి అన్ని కులాల వారికి కాలేజీలు స్థాపించాడు. ఆ స్థలాలను కూడా ఈ ద్వారంపూడి కొట్టేశాడు.
ఏ మూలకు వెళ్లినా ఈ ఎమ్మెల్యే దోపిడీ కనిపిస్తుంది. ఈ రౌడీ, గూండా చంద్రశేఖర్ రెడ్డికి చెబుతున్నాను… ఈసారి ఎన్నికలో(Elecation) నిన్ను గెలవనివ్వను. ఇక్కడికే వచ్చేశా..మంగళగిరి (Mangalagiri) లోనే ఉంటా. ఏ గూండా వస్తాడో రమ్మనండి. చూసుకుందాం” అంటూ పవన్ కల్యాణ్ ఘాటుగా హెచ్చరించారు. క్రిమినల్స్(Criminals)కు సీఎం అండగా ఉన్నారని పవన్ ఆరోపించారు.జగన్ ఓ దోపిడీ దారుడని, నేరస్తుడని అన్నారు. పాలించే నాయకుడు సరిగా లేకపోతే పాలన అస్తవ్యవస్తమవుతుందన్నారు. కాకినాడ (Kakinada) జనవాణిలో సమస్యలు వింటే బాధ కలగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లోనే తాను పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి ఉంటే వైఎస్ జగన్ ను రానిచ్చేవాడిని కాదని పవన్ వెల్లడించారు