»Comedian Kevvu Karthik Introduced The Wife To Be Siri
Kevvu Karthik: కాబోయే భార్యను ఇంట్రడ్యూస్ చేసిన కమెడియన్ కెవ్వు కార్తీక్
జబర్దస్త్ కమెడియన్..కెవ్వు కార్తీక్(Kevvu Karthik) త్వరలోనే ఓ ఇంటివాడుకాబోతున్నాడు. పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్‌లో టీమ్ లీడర్‌గా కొనసాగుతున్న అతను త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ విషయాన్ని అతనే ఇటీవల సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించాడు.
సోషల్ మీడియా ద్వారా ఓ శుభవార్తను పంచుకున్నాడు జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్(Kevvu Karthik). అయితే తాజాగా మరోసారి తాను చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేశాడు కార్తీక్. ఇన్‌స్టాలో తనకు కాబోయే భార్యతో కలిసున్న ఫొటోలను అతను పంచుకున్నారు. ఓ ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చాడు. ఫైనల్‌గా నేను చేసుకోబోయే అమ్మాయి అంటూ వెెళ్లడించాడు. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని విన్నా. కానీ ఆ సమయంలో నాకు అర్థం కాలేదు. రెండు భిన్నమైన మనసులు, భిన్నమైన జీవితాలు, భిన్నమైన అభిప్రాయాలు, విభిన్న ప్రపంచాలు జీవిత ప్రయాణమనే పుస్తకంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు ఒకే హృదయంగా మారుతున్నాయి. వెల్కమ్ టూ మై లైఫ్ సిరి. అంటూ తనకు కాబోయే భార్యను ఇంట్రడ్యూస్ చేశాడు కమెడియన్ కార్తీక్.
ప్రస్తుతం కెవ్వు కార్తీక్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో మంచి ఉద్యోగం వదులుకుని మరీ ఇండస్ట్రీలోకి వచ్చాడు కార్తీక్. తెలంగాణ ప్రాంతానికి చెందిన అతను ఇంజనీరింగ్ చదువుతూనే మిమిక్రీలో డిప్లొమా పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంటెక్ చేసి మంచి ఉద్యోగం(job) సంపాదించాడు. అయితే మిమిక్రీ, నటనపై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఉద్యోగాన్ని వదులుకున్నాడు. హైదరాబాద్ వచ్చి మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజీ షోలు కూడా చేశాడు. అనంతరం కామెడీ క్లబ్, జబర్దస్త్ షోల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్‌లో మొదట ఒక టీమ్‌లో మెంబర్‌గా ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆ తర్వాత తన ట్యాలెంట్‌తో టీమ్ లీడర్‌గా ఎదిగాడు.