అత్యంత అరుదైన H3N8 బర్డ్ ఫ్లూ రకం వైరస్ తో ప్రపంచంలోనే తొలి మరణం నమోదయింది. చైనాలోని గ్వాంగ్ డాంగ్ రాష్ట్రానికి (southern province of Guangdong) చెందిన 56 ఏళ్ల మహిళ (Chinese woman) ఈ బర్డ్ ప్లూ (bird flu) కారణంగా మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది (World Health Organisation-WHO). ఏవియన్ ఇన్ ఫ్లుయెంజా ఉపకరమైన H3N8 సోకిన మూడో వ్యక్తి ఈమె. ఈ మూడు కేసులు కూడా చైనాలోనే నమోదయ్యాయి. గత ఏడాది ఇద్దరు ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పుడు ఈ మహిళ ఇదే వ్యాధి సోకినప్పటికీ.. వారిలో కోలుకోలేక.. మృత్యువాత పడింది. H3N8 పక్షుల్లో సాధారణంగా కనిపిస్తుంది. కానీ మనుషులకు ఇది వ్యాప్తి చెందడం అత్యంత అరుదైన అంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ బర్డ్ ఫ్లూ రకం మనుషుల నుండి మనుషులకు సోకే అవకాశం లేదు. దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్షియల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గత నెల చివరలో మూడు ఇన్ఫెక్షన్లను నివేదించింది. అయితే మహిళ మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. సదరు మహిళకు పలు అంతర్లీన పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. సదరు మహిళతో సన్నిహితంగా ఉన్న వారిలో ఎవరిలోను ఈ బర్డ్ ఫ్లూ కనిపించలేదు.