PLD: నరసరావుపేట-గుంటూరు రోడ్డుపై ఇవాళ జరిగిన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రయాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. టర్నింగ్ వద్ద అతి వేగంగా వెళ్తున్న బైక్ లారీని ఢీకొని వెనుక టైర్ల మధ్య ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో గణేశ్ (26) అక్కడికక్కడే మృతి చెందగా, హనుమంత చారి(31)కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.