మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు, కారు రెండు వాహనాలు వేగంగా ఎదురెదురుగా వచ్చి ప్రమాదవశాత్తు ఢీకొట్టాయి. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎయిర్బ్యాగ్స్ కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ ఘటనలో బస్సు ఢీకొనగా ఫోర్డ్ ఫియస్టా కారు నుజ్జునుజ్జుగా మారిపోయి దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాంగ్లీ జిల్లాలోని వీటా-న్యూరీ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
అయితే అసలు ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరిది తప్పు, బస్సుదా లేదా కారు వాళ్లదా అనే కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు అతివేగం వల్ల యాక్సిడెంట్ జరిగిందా అని పలు రకాలుగా పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.