»Fatal Accident While Going For Tour At Maharashtra Chikhaldara Four People Died
Car fell: షికారు కోసం వెళ్తే ఘోర ప్రమాదం..నలుగురు మృతి
టూరిస్టు ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే కొండలు లేదా జలపాతలు లేదా ఆయా ప్రదేశాల వద్ద ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చెెప్పలేం. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. టూర్ కోసం వెళ్లిన పర్యటకుల వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత చెందారు.
Fatal accident while going for tour at maharashtra chikhaldara Four people died
తెలంగాణ నుంచి పలువురు బ్యాంకు ఉద్యోగులు టూర్ కోసం మహారాష్ట్ర(maharashtra) వెళ్లారు. కానీ ఆ క్రమంలోనే విషాదం చోటుచేసుకుంది. చిఖల్దార(chikhaldara) సమీపంలోని మడ్కి వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చిఖల్దారాకు వెళ్లే మార్గంలో వారి కారు 200 అడుగుల లోతైన లోయలో పడింది. ఆదివారం ఉదయం ఏడున్నర ప్రాంతంలో పరట్వాడ-చిఖల్దారా రహదారిపై మోతా గ్రామ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఏడుగురు AP 28 D W 21 19 కారు నంబర్లో మెల్ఘాట్ను సందర్శించడానికి వచ్చారు.
అయితే భారీ వర్షం కారణంగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే ఆ వాహనం లోతైన లోయలోకి పడిపోయినట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి కోసం రెస్క్యూ టీమ్ వెతుకులాట కొనసాగిస్తోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అచల్పూర్లోని ఉపజిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం అమరావతిలోని జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే కారులో ఉన్న ప్రయాణికులు మొత్తం తెలంగాణ వాసులని తేలింది. వారి పేర్లు సహా మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.