»Botsa Satyanarayana Said Parents Of Students Dont Need To Worry We Will Take Every Ap Student In Manipur
Botsa satyanarayana: విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన వద్దు..ప్రతి విద్యార్థిని తీసుకొస్తాం
మణిపూర్లో(manipur) చిక్కుకున్న ప్రతి ఏపీ విద్యార్థిని(ap students) తీసుకొస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ(botsa satyanarayana) స్పష్టం చేశారు. ప్రత్యేక విమానంలో అక్కడ ప్రస్తుతం ఉన్న 157 మంది ఏపీ స్టూడెంట్స్ ను తీసుకొస్తామన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని అన్నారు.
మణిపూర్లో అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన 157 మంది ఆంధ్రా విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చేందుకు ముమ్మర చర్యలు చేపట్టినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ(botsa satyanarayana) వెల్లడించారు. ప్రత్యేక విమానంలో వారిని స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో ఏపీ అధికారులు చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలో విద్యార్థుల(students) పేరెంట్స్ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. విద్యార్థులు తమతో టచ్ లో ఉన్నారని మంత్రి చెప్పారు. ఈ విషయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రత్యేక విమానంలో AP విద్యార్థులను తిరిగి పంపించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంగీకరించింది. సమయం, విమాన వివరాలను తెలియజేస్తామని అధికారులు తెలిపారని ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో బాగంగా వెల్లడించింది. మణిపూర్(manipur)లోని ఎన్ఐటీ, ఐఐఐటీ, సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్శిటీ వంటి విద్యాసంస్థల్లో 157 మంది ఏపీ విద్యార్థులు చదుతున్నట్లు రాష్ట్రం గుర్తించింది.