టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎంపీ అర్వింద్ ల మధ్య వార్ కొనసాగుతోంది. ఇటీవల అర్వింద్… కవితపై కామెంట్స్ చేశారనే కారణంతో…. ఆయన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది.
తన జోలికొచ్చి.. ఓవర్ గా మాట్లాడితే చెప్పుతో కొడతానని కవిత్ వార్నింగ్ ఇవ్వగా.. తగ్గేదే లేదంటూ అర్వింద్ కౌంటర్ ఎటాక్ కొనసాగించారు. ఈలోపు వేరే ఇష్యూలు తెరపైకి రావడంతో వీళ్లిద్దరి వివాదం సైలెంట్ అయింది. కానీ, అర్వింద్ మాత్రం వదలలేదు. కవితపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ. ఆమెపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. తనను కవిత దూషించారని, దాడులు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. తనను బెదిరించడంతో పాటు తన కుటుంబసభ్యులను అవమానించిన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు.
తన ఇంటిపై దాడి ఘటనపైనా వివరించారు. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారించనుంది. అర్వింద్ తరఫున లాయర్ రచనా రెడ్డి వాదనలు వినిపించనున్నారు.