లిక్కర్ స్కాంలో ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. దీంతో బంధువులు, బీఆర్ఎస్ శ్రేణుల్లో టెంక్షన్ నెలకొంది. దీనికి సంబంధింఇన వివరాలు ఇలా ఉన్నాయి.
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువులకు సంబంధించిన ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు చేస్తున్నారు. శనివారం ఉదయం 6 : 30 కే హైదరాబాద్ వచ్చిన ఈడీ అధికారులు ముందుగా కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు మొదలు పెట్టారు. మొత్తం ఏడుగురు ఈడీ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. కవిత అరెస్టు అనంతరం ఈ సోదాలు జరుగుతుండటంతో అంతటా టెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam Case) ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. దీన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్CM Kejriwal), కవిత అరెస్టులు జరిగిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ కవిత((MLC Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. అధికారులు ఆమెను ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెడతారు. కవితను మరో మూడు రోజుల పాటు తమ కస్టడీలో ఉంచాలని ఈడీ కోరే అవకాశాలు ఉన్నాయి. కేజ్రీవాల్, కవితలు ఇద్దరినీ కలిపి ఒకే సారి ప్రశ్నించే యోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకనే ఈ మేరకు కస్టడీ గడువును పెంచమని వారు కోర్టును కోరే అవకాశాలున్నట్లు సమాచారం.