»Bbc India Ed Files Case Against Bbc India Under Fema For Fdi Violations
దిగ్గజ మీడియా సంస్థ BBC Indiaపై ఈడీ కేసు నమోదు..
బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేయడం రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా గొంతును నరేంద్ర మోదీ తొక్కేస్తున్నారని కాంగ్రెస్ తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. మీడియా సంస్థలపై కక్ష సాధింపు చర్యలు సబబు కాదని హితవు పలికాయి.
ప్రపంచంలోనే దిగ్గజ మీడియా సంస్థ అయిన బీబీసీ ఇండియాపై (British Broadcasting Corporation- BBC) ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈ) (Enforcement Directorate) కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల (Foreign Funds) వ్యవహారంలో ఫెమా (FEMA) నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా కేసు నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో భాగంగా ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించాలని బీబీసీ ఇండియాను ఈడీ ఆదేశించింది. ప్రవాసుల నుంచి అందిన నిధులు (ఫారెన్ రెమిటెన్సు) వివరాలు కూడా పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి బీబీసీపై కఠినంగా వ్యవహరిస్తోంది. మోదీ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్లపై (Godra Riots) బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ (India: The Modi Question) అనే డాక్యుమెంట్ (Documentary) రెండు భాగాలుగా తీసింది. అల్లర్ల ప్రధాన సూత్రధారి నరేంద్ర మోదీ (Narendra Modi) అని ఆ డాక్యుమెంటరీలో ఉండడంతో తీవ్ర కలకలం ఏర్పడింది. ప్రజలంతా ఆ డాక్యుమెంటరీని చూశారు. అయితే ఆ డాక్యుమెంటరీని అప్రజాస్వామికంగా భారతదేశంలో వీక్షించే హక్కును తొలగించింది.
అప్పటి నుంచి బీబీసీపై ప్రధాని నరేంద్రమోదీ కక్షపూరిత చర్యలు మొదలుపెట్టారు. కొన్ని నెలల కిందట ఐటీ శాఖ (IT Department) బీబీసీపై దాడులు చేసిన విషయం తెలిసిందే. తనిఖీలు విస్తృతంగా జరపగా అవి తనిఖీలు కాదు సర్వేగా ఐటీ శాఖ పేర్కొంది. అప్పుడు దాడులు.. ఇప్పుడు కేసులు మోపడంపై తీవ్ర దుమారం రేగుతోంది. కాగా బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేయడం రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా గొంతును నరేంద్ర మోదీ తొక్కేస్తున్నారని కాంగ్రెస్ తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. మీడియా సంస్థలపై కక్ష సాధింపు చర్యలు సబబు కాదని హితవు పలికాయి. నరేంద్ర మోదీ పాలనలో మీడియాకు స్వేచ్ఛ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.