Chandrababu సెల్ఫీ ఛాలెంజ్.. గుండెల్ని పిండేస్తున్న జగన్ చేసిన తప్పు
సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చింది? 18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రులు చేతులపై పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం జగన్ (YS Jagan) పాలనతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. డబ్బులు పంచుడు అని చెబుతున్నా.. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) హయాంలో పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తొలగిస్తున్నాడు. టీడీపీ కార్యకర్తలే కాదు సామాన్యుల పింఛన్లు (Pensions) కూడా తొలగిస్తున్నారు. అందులో భాగంగానే ఓ దివ్యాంగురాలి పింఛన్ కూడా తొలగించారు. ఆమెను చూస్తేనే కలచివేస్తోంది. అలాంటి అభాగ్యురాలి పింఛన్ ను తీసేసిన దౌర్భాగ్యం జగన్ ప్రభుత్వానిది. దీనిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నిలదీశారు. ఈమె పింఛన్ తీసేందుకు నీకు మనసెలా వచ్చింది? అని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలితోనే సీఎం జగన్ కు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్ (Selfie Challenge) విసిరారు.
కృష్ణా జిల్లా (Krishna District) మచిలీపట్నంలోని (Machilipatnam) వార్డు నంబర్ 22లో సీమ పర్వీన్ మానసిక ఎదుగుదలతో పాటు శారీరక ఎదుగుదల లేదు. 18 ఏళ్లు వచ్చినా ఆమె తల్లిదండ్రులపైనే ఆధారపడి జీవిస్తోంది. సీమ పర్వీన్ కు టీడీపీ హయాంలో ఎన్టీఆర్ భరోసా కింద రూ.1,500 పింఛన్ అందించేవారు. అయితే జగన్ సీఎం అయ్యాక సీమ పర్వీన్ కు సంబంధించిన పింఛన్ ఇవ్వడం లేదు. పింఛన్ పేర్ల జాబితాలో ఆమె పేరును తొలగించారు.
మచిలీపట్నంలో బుధవారం రాత్రి ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ (Idhem Karma Mana Rashtraniki) అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీమ పర్విన్ (Seema Parvin) కుటుంబం చంద్రబాబును కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఆమె పరిస్థితిని చూసిన బాబు చలించిపోయారు. కరెంట్ చార్జీల (Power Bill) బిల్లు ఎక్కువ వచ్చిందని ఆ అమ్మాయి కుటుంబంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఆమె పరిస్థితి చూడకుండా పింఛన్ తొలగించారు. తొలగించిన ఫించన్ రూ.36 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.
‘విభిన్న ప్రతిభావంతురాలైన సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చింది? 18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రులు చేతులపై పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా? పెన్షన్ కు నాడు అర్హురాలు, నేడు అనర్హురాలు ఎలా అయ్యింది? 90శాతం వైకల్యం ఉన్న అమెకు నిబంధనల పేరుతో పెన్షన్ తొలగించడమే మీ మానవత్వమా? వాస్తవంగా చెప్పాలి అంటే వైకల్యంతో ఉంది ఆమె కాదు….మీరు, మీ ప్రభుత్వం’ అని చంద్రబాబు ట్వీట్ (Tweet) చేశారు. ఈ సందర్భంగా సీమ పర్విన్ కు మంజూరు చేసిన పింఛన్ పుస్తకం, ఆమెతో తీసుకున్న ఫొటోను పోస్టు చేశారు. ఇది చూసిన ప్రజలు పాపం ఆమెకు పింఛన్ తొలగించడానికి జగన్ కు చేతులు ఎలా వచ్చాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
18 ఏళ్లుగా తల్లిదండ్రులే ఆసరాగా జీవిస్తున్న దివ్యాంగురాలు సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ ను తీసేసిన నువ్వు సంక్షేమం గురించి మాట్లాడటం ఏంటి జగన్? కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే పింఛన్ తీసేస్తావా? ఇదేనా సంక్షేమం? – @ncbn గారు pic.twitter.com/scJV9PEkow
విభిన్న ప్రతిభావంతురాలైన సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చింది? 18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రులు చేతులపై పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా?(1/2)#SelfieChallengeToJaganpic.twitter.com/y6LU27mCAR