ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ సీపీ (YSRCP) ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. ప్రచార పిచ్చి మరీ దారుణంగా ఉంది. వైఎస్సార్ సీపీకి ప్రచార పిచ్చి బాగా ఎక్కింది. ఇన్నాళ్లు భవనాలు, కార్యాలయాలకు పార్టీ రంగులు (Colours) వేసింది. తాజాగా స్టిక్కర్లు అతికించడం వంటి దరిద్రపు గొట్టు ఆలోచన చేస్తోంది. పార్టీని ప్రజలు మరచిపోతారనే భయంతో ఎక్కడ కనిపిస్తే అక్కడ జగన్ ఫొటోలతో కూడిన స్టిక్కర్లు (Stickers) అంటిస్తున్నారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ.. ఏది కనిపిస్తే దాని మీద తెగ స్టిక్కర్లు అతికిస్తున్నారు. మరి ఎంతలా అంటే మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, చెప్పులకు వంటి చోట్ల అంటిస్తున్నారు. అయితే చాలా చోట్ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాటిని స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు. ఇలాగే ఒక చోట ఓ కుక్క జగన్ స్టిక్కర్ (Jagan Sticker Dog)ను తొలగించింది. అయితే స్టిక్కర్ ను తొలగించిన కుక్కపై వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం మరింత వింతగా ఉంది.
శ్రీకాకుళం జిల్లాలోని (Srikakulam District) ఓ గ్రామంలో ఓ ఇంటి గోడపై ‘జగనన్నే మా భవిష్యత్’ స్టిక్కర్ అతికించారు. ఆ స్టిక్కర్ ను రాత్రి పూట ఒక కుక్క అటుగా వచ్చి నోటితో పీకేసింది. స్టిక్కర్ తొలగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారింది. దీనిపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడకు (Vijayawada) చెందిన ఓ వైఎస్సార్ సీపీ నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చసింది. నున్న పోలీస్ స్టేషన్ (Nunna Police)కు వెళ్లి కుక్కపై ఫిర్యాదు చేసింది. సహజంగా కుక్క పీకేస్తే దానికి కుట్ర కోణం దాగి ఉందని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ స్టిక్కర్ పీకేయడంతో నాలుగు కోట్ల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభిమానంతో ఇది ఫిర్యాదు చేశాం. కుక్క జగన్ అవమానించడం చాలా బాధకరమైన విషయం. మేం జగన్ ను చాలా గౌరవిస్తాం. జగన్ కు ఎక్కడా గౌరవం తగ్గకూడదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతాయనే ఉద్దేశంతో మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం. కుక్క మీద ఫిర్యాదు చేశాం. కుక్కను అరెస్ట్ చేయాలి. ఆ కుక్కతో చింపేయించిన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని మహిళలు డిమాండ్ చేశారు.