Bank holidays: ఆగస్టులో 14 రోజులు బ్యాంకులకు సెలవు..పనులు ముందే చూసుకోండి!
ఆగస్టులో ఏదైనా అత్యవసర పని కోసం బ్యాంకుకు వెళ్తున్నారా అయితే ఓసారి ఆగండి. ఎందుకంటే ఈ నెలలో 14 రోజులు ఉద్యోగులకు సెలవులున్నాయి. వారి సెలవులను చూసుకుని వెళ్లండి. బ్యాంకు హాలిడే రోజున వెళ్లకుండి సుమా.
పలు రకాల పనుల కోసం ఆగస్టులో బ్యాంకులకు వెళ్లే వారు ఓసారి బ్యాంక్ సెలవులపై కూడా ఓ లుక్కేయండి. ఈనెలలో ఏకంగా 14 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి అందుకే. అయితే ఏ రోజుల్లో హాలీడేస్ ఉన్నాయో ఇప్పుడు చుద్దాం. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రోజులలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ఆగస్టు 6: నెలలో మొదటి ఆదివారం
ఆగస్ట్ 8: టెండాంగ్ లో రమ్ ఫాత్ (టెండాంగ్ లో రమ్ ఫాత్ కారణంగా గ్యాంగ్టక్లో బ్యాంకులు మూసివేయబడతాయి)
ఆగస్టు 12: నెలలో రెండవ శనివారం
ఆగస్టు 13: నెలలో రెండవ ఆదివారం
ఆగష్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 16: పార్సీ నూతన సంవత్సరం (పార్సీ నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి బేలాపూర్, ముంబై, నాగ్పూర్లలో బ్యాంకులు మూసివేయబడతాయి)
ఆగష్టు 18: శ్రీమంత శంకరదేవుని తిథి (శ్రీమంత శంకరదేవుని తిథి కారణంగా గౌహతిలో బ్యాంకులు మూసివేయబడతాయి)
ఆగస్టు 20: మూడవ ఆదివారం
ఆగస్ట్ 26: నెలలో నాలుగో శనివారం
ఆగస్ట్ 27: నెలలోని నాల్గవ ఆదివారం
ఆగస్ట్ 28: మొదటి ఓనం (మొదటి ఓనం జరుపుకోవడానికి కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులు మూసివేయబడతాయి)
ఆగస్ట్ 29: తిరువోణం (తిరువోణం జరుపుకోవడానికి కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులు మూసివేయబడతాయి)
ఆగస్టు 30: రక్షా బంధన్ (రక్షా బంధన్ కారణంగా జైపూర్, శ్రీనగర్లలో బ్యాంకులు మూసివేయబడతాయి)
ఆగస్టు 31: రక్షా బంధన్/శ్రీనారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్ (రక్షా బంధన్/శ్రీనారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్ కారణంగా గాంగ్టక్, డెహ్రాడూన్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో బ్యాంకులు మూసివేయబడతాయి)