zero bank account: దేశ ఆర్థిక వ్యవస్థ నేడు వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు విస్తరిస్తుంది కూడా. ముఖ్యంగా ప్రపంచ దేశాలతో ఆర్థికరంగంలో పోటీ పడాలంటే ప్రజలందరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్(JanDhan) పేరిట ప్రజలందరికి బ్యాంక్ ఖాతాలను అందిస్తోంది. అవే జీరో అకౌంట్లు(Zero Accounts). కనీసం బ్యాలెన్స్ అవసరం లేని ఈ ఖాతాలు భారతదేశంలోని పేదలకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక అప్పటి నుంచి చాలా మంది మహిళలు బ్యాంక్ ఖాతా అనేది ఓ ప్రాథమిక అవసరంగా భావిస్తున్నారు. ఇవి కూడా సాధారణ బ్యాంక్ అకౌంట్ల మాదిరిగానే అన్ని సదుపాయాలను కల్పిస్తున్నాయి. అయితే డిపాజిట్, విత్‌డ్రా విషయంలో కొన్ని షరతులు వర్తిస్తాయి. అయితే సాధారణ ప్రజలకు ఈ ఖాతాలతో ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే జీరో బ్యాలెన్స్ అకౌంట్ల ఆదరణ విపరీతంగా పెరగడంతో దేశంలో దాదాపు చాలా బ్యాంక్‌లు ఈ తరహా ఖాతాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. మరి అవేంటో, వాటి వలన ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చో తెలుసుకుందాం.
హెచ్డీఎఫ్సీ(HDFC)
ప్రయివైట్ దిగ్గజ బ్యాంక్ సంస్థ అయిన అయిన హెచ్డీఎఫ్సీ కూడా జీరో బ్యాంకు ఖాతాను అందిస్తుంది. ఈ ఖాతా ఉచిత అంతర్జాతీయ లేదా రూపే డెబిట్ కార్డ్‌లు, నెఫ్ట్, ఆర్టీజీఎస్ బదిలీలు, ఫోన్ బ్యాంకింగ్‌లను అందిస్తుంది. అంతేకాకుండా ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు నాలుగు సార్లు నగదును ఉచితంగా తీసుకోవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)
ఈ బ్యాంక్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. వినియోగదారుల వద్ద కేవైసీ ఉంటే చాలు జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరుస్తుంది. ఇక దేశంలో చాలా మహిళలు ఈ బ్యాంక్ లో ఖాతాలు ఉన్నాయి. దీనికి ఎలాంటి రుసుము ఉండదు. అలాగే సేవింగ్స్ కచ్చితంగా ఉండాలి అన్న రూలే లేదు. ఖాతాదారు ప్రాథమిక రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్‌ను అందుకుంటారు. ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లేదా ఏటీఎంలో ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా ఉంది.
యాక్సిస్ జీరో బ్యాలెన్స్ ఖాతా(AXIS)
రూపే కోసం జీరో బ్యాలెన్స్ డెబిట్ కార్డ్‌తో రూ. 10,000 వరకు నగదు రూపంలో ఉంచవచ్చు. అదనంగా ప్రతి నెలా అదనపు బ్యాంకు నుంచి నాలుగు పార్లు విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా కాంప్లిమెంటరీగా అందిస్తుంది.
ఇండస్ ఇండ్ జీరో బ్యాలెన్స్ ఖాతా(INDUSIND)
భారతీయ పౌరుడు అయి ఉండి. కనీసం 18 సంవత్సరాలతో పాటు చెల్లుబాటు కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటే చాలు ఇక్కడ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాకు అర్హులు. ప్రతి నెలా పాస్‌బుక్, డెబిట్ కార్డ్, చెక్‌బుక్ కోసం ఐదు ఉచిత లావాదేవీలు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్టీజీఎస్, నెఫ్ట్ద్వారా ఫండ్ బదిలీలు కూడా ఉచితంగా చేయవచ్చు.
ఏయూ డిజిటల్ సేవింగ్స్ ఖాతా(AU Small Finance BAnk)
అన్ని బ్యాంకింగ్, ఆర్థిక సంబంధిత వ్యాపారాలను వీడియో చాట్ల ద్వారా నిర్వహించాలనే ఆలోచనను ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అందించింది. ఫలితంగా ఖాతా తెరవడం నుంచి డిపాజిట్ చేయడం వరకు లేదా మరేదైనా ప్రశ్న కోసం ఒకరు బ్యాంక్‌తో వీడియో కాల్ని ప్రారంభిస్తారు. దీనిలో ప్రశ్నలకు బ్యాంకు ఉద్యోగి నిజ సమయంలో సమాధానాలు ఇస్తారు. ఫోర్బ్స్ ప్రకారం మీరు ఇక్కడ చాలా సులభంగా జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరవవచ్చు.