కృష్ణా: పద్మశ్రీ మైనేని హరిప్రసాద్ దివిసీమకు గర్వకారణం అని టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు అన్నారు. సోమవారం అవనిగడ్డలో టీడీపీ ఆధ్వర్యంలో మైనేని హరిప్రసాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అవనిగడ్డ మండలం పాత ఎడ్లంకకు చెందిన మైనేని హరిప్రసాద్ కల్పక్కం న్యూక్లియర్ రియాక్టర్ స్టేషన్ నిర్మాతగా దేశానికి విశేష సేవలు చేశారన్నారు.