VZM: విజయనగరంలోని పాత మహారాజా ఆసుపత్రి వద్ద రైతు బజార్‌ను తొలగించవద్దని వర్తకులు సోమవారం కలెక్టరేట్ వద్ద పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రైతు బజార్లో కూరగాయలు విక్రయిస్తూ 26 ఏళ్లుగా 46 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నామని తెలిపారు. ప్రత్యామ్నాయ స్థలం చూపించకుండా ఖాళీ చేయమనడం అన్యాయమన్నారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.