RR: నేరాల నియంత్రణతోపాటు నేరస్తులను పట్టుకోవడానికి CC కెమెరాలు కీలక భూమిక పోషిస్తాయని ACP కాశిరెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధి ఇనాంగూడ గ్రామం కార్తీక్ హోమ్ ఫేస్- 2లో 16 CCకెమెరాలను CI అశోక్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ నివాస, వ్యాపార, వాణిజ్య, విద్యాలయాల్లో కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలన్నారు.