KMR: సంగారెడ్డి నుంచి బోధన్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు సోమవారం బాన్సువాడలోని పూల దుకాణంలోకి దూసుకెళ్లింది. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన కండక్టర్ బస్సును నిలిపివేశాడు. దీంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో పూల దుకాణం వద్ద నిలిపి ఉంచిన బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఎవరికి గాయాలు కాలేదు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.