»Bajrang Punia Returned The Padma Shri Award Kohlis Post Went Viral
Video Viral: పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేసిన భజరంగ్ పునియా..కోహ్లీ పోస్ట్ వైరల్
రెజ్లర్ భజరంగ్ పునియా ఢిల్లీలో తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్న వీడియోను భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ షేర్ చేశారు. ఆ వీడియోను చూస్తుంటే హృదయం ముక్కలవుతోందని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సంజయ్ సింగ్ ఎన్నికయ్యాడని తెలియగానే మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ తాను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేశారు. తాజాగా మరో రెజ్లర్ భజరంగ్ పునియా కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నానంటూ ప్రధాని మోదీకి లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
https://twitter.com/i/status/1738168914021130284
ఈ ఘటనపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. భజరంగ్ పునియా ఢిల్లీలో తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్న వీడియోను ట్వీట్ చేస్తూ ఆ వీడియోను చూస్తుంటే హృదయం ముక్కలవుతుందని కోహ్లీ కామెంట్ చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య గత అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో రెజ్లర్ల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన సంజయ్ సింగ్ ఆనాటి అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు కావడంతో రెజ్లర్లు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.