»Are You Providing Security To Chandrababu And Lokesh Centres Directive To App
Chandrababu and Lokesh:కు భద్రత కల్పిస్తున్నారా..ఏపీకి కేంద్రం ఆదేశం
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu), ఆయన కుమారుడు నారా లోకేష్(nara lokesh)లకు భద్రత కల్పించిన వివరాలను సమర్పించాలని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు భద్రత కల్పిస్తున్నారా లేదా అంటూ ప్రశ్నిచింది.
టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఫిర్యాదు మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(chandrababu naidu), ఆయన తనయుడు నారా లోకేశ్(nara lokesh)లకు అందజేసిన భద్రత వివరాలను సమర్పించాలని కేంద్ర హోంశాఖ(central home ministry) శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై జరిగిన దాడుల నేపథ్యంలో రవీంద్రకుమార్ ఇటీవల వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ యువగళం పాదయాత్రకు భద్రత కల్పించడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రవీంద్రకుమార్ కేంద్ర హోంశాఖకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నవంబర్ 4, 2022న ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై రాళ్లదాడి(attack) ఘటనకు సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీని కూడా ఆదేశించింది. రాష్ట్ర పర్యటనల సందర్భంగా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లకు భద్రతను పెంచేందుకు కే రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిలకు కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది.